హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 తేదీ నుంచి ఏడాది పాటు ఈ హెచ్ఆర్ఏ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.