అందరూ చేసే విమర్శలు వేరు.. మంత్రి పేర్నినాని సెటైర్లు వేరు.. ఆయన రొటీన్ రొడ్డకొట్టుడు విమర్శల్లా కాకుండా.. కాస్త సెటైరిక్‌గా విమర్శలు చేస్తుంటారు. తాజాగా దేవినేని ఉమ అరెస్టుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్నచంద్రబాబుకు ఆయనపై ఎందుకు కేసు పెట్టారో తెలియదా అంటూ నిలదీశారు. అసలు ఇలా మాట్లాడుతున్న చంద్రబాబుకు ఆవగింజంతైనా సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు.