వైసీపీ గెలుచుకున్న 151 నియోజకవర్గాల్లోనే కాదు, ప్రతిపక్షాలు గెలుచుకున్న మిగతా చోట్ల కూడా అధికార పార్టీ ప్రభావం గట్టిగానే ఉంది. అయితే వైరివర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు వైసీపీకి మద్దతివ్వడంతో ఆయా నియోజకవర్గాలు సమస్యాత్మకంగా మారాయి. ఆమధ్య గన్నవరం విషయంలో ఎమ్మెల్యే వంశీకి, ఆయన ప్రత్యర్థికి సీఎం జగన్ స్వయంగా సయోధ్య కుదర్చాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇప్పుడిదే సిచ్యుయేషన్ రాజోలులో వచ్చింది. రాజోలులో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ నాయకులకు షాకులమీద షాకులిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీలోనే మూడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.