పోర్న్ చూడటానికి అలవాటుపడ్డవారు మానసిక ఒత్తిడికిలోనవుతారు. తద్వారా మద్యానికి, మత్తుమందులకు బానిసలవుతుంటారు. మొదట్లో సరదాగా ప్రారంభమైనఈ పోర్న్ వ్యసనం ఆ తర్వాత కొత్తదనం కోసం తపిస్తుంది. అలా క్రమంగా విపరీతమైన ప్రవర్తన ఏర్పడుతుంది. ఇలాంటి వారే చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతుంటారు. అదే పెద్దలైతే జీవిత భాగస్వాములను హింసిస్తుంటారు. ఇలా పోర్న్ వీక్షణతో వచ్చే చిక్కులెన్నో.