మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఈ జీఎస్టీ వసూళ్లు ఓ సంకేతమని ఆర్థికశాఖ చెబుతోంది. 2020 జులైలో మన దేశంలో జీఎస్టీ వసూళ్లు 87 వేల 422 కోట్లు మాత్రమే. అదే ఈ ఏడాది జూన్లో 92 వేల 849 కోట్ల రూపాయల జీఎస్టీ మాత్రమే వసూలైంది. ఇక జులై విషయానికి వస్తే.. ఇది చాలా బాగా పెరిగింది. ఈనెలలో లక్షా 16 వేల 393 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం తన తాజా లెక్కల్లో చెప్పింది.