ఈనెల రోజులు ప్రపంచానికి ఇండియా కింగ్.. అదేంటి.. ప్రపంచానికి ఇండియా కింగ్ ఎలా అవుతుందంటారా.. కాదా మరి.. ఎందుకంటే.. ఈ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ప్రాతినిధ్యం వహించేది ఏది.. అదే ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్య రాజ్య సమితికి అనేక పాలనా విభాగాలు ఉంటాయి. అందులో చాలా కీలకమైంది భద్రతా మండలి.. సెక్యూరిటీ కౌన్సిల్. అలాంటి భద్రతా మండలి ఇండియా ఇప్పుడు అధ్యక్షురాలిగా వ్యవహరించబోతోంది.