కృష్ణమ్మ ఎగువ నుంచి ఇంకా వరద వచ్చే అవకాశం ఉండటం వల్ల వరద ముంపు ప్రభావిత అధికారులను కలెక్టర్ మరింత అప్రమత్తం చేశారు. జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన లంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.