కరోనాలోని కొత్త డెల్టా వేరియంట్ ఇప్పుడు చైనానూ వణికిస్తోంది. మొదటి కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కున్న చైనా.. ఈ డెల్టా వేరియంట్ విషయంలో మాత్రం తడబడుతోంది. వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ ఇప్పుడు చైనాను కమ్మేస్తోంది. డెల్టా వైరస్ దెబ్బకు ఇప్పుడు డ్రాగన్ దేశం అల్లాడుతోంది.