ఏపీలో ఈనెల 16నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. మరోవైపు సీఎం జగన్ చేపట్టిన సమీక్షలో మరో రెండు నెలలు ఏపీ వాసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్కూళ్లు పునఃప్రారంభిస్తామని చెబుతూనే.. ఆలోగా టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు.