గవర్నర్ కోటా కోసం తెలంగాణలో అర్హులు లేరా.. అంటే చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు వాగ్గేయ కారుడు దేశపతి శ్రీనివాస్, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి వారు ఎందరో ఉన్నారు. గతంలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కూడా ఈసారి కూడా అదే తరహా ఆనవాయితీ కొనసాగించి ఉంటే బావుండేది కానీ.. కేసీఆర్ ఈ గవర్నర్ కోటాను కూడా రాజకీయాల కోసం వాడేసుకోవడం బుద్ధి జీవులను నిరాశపరచడమే అవుతుంది.