విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన ప్రతిఒక్కరికీ తాను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తెలుగు వారి త్యాగం, ఆత్మగౌరవం నుండి పుట్టినదే విశాఖ స్టీల్ ప్లాంట్ అని వ్యాఖ్యానించారు. 32 మంది ప్రాణత్యాగాల నుండి పుట్టిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు అన్ని పార్టీలు కలిసి పోరాడాలని రామ్మోహన్ నాయుడు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల హక్కు.....స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాము అంటే ఊరుకునేదేలేదని లేదని కేంద్రానికిర వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ఆంధ్రావాళ్ళను చిన్న చూపుచూస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారిని ఆదుకోవాలని తాను ప్రధానమంత్రిని కోరుతున్నానని చెప్పారు.