విచిత్రం ఏంటంటే.. అలా సవాల్ విసిరిన కొన్ని గంటల్లోనే తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు ప్రారంభమయ్యాయి. ఒక యువతి పిర్యాదు మేరకు హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే యూనిట్ ఆఫీస్ లో చొరబడ్డారని మల్లన్న వర్గాలు చెబుతున్నాయి.