కల్తీ మద్యం అమ్మడం పెద్ద నేరం కాదనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉండేది. మహా అయితే కల్తీ మద్యం అమ్మేవారిపై జరిమానా విధించి వదిలేసేవారు. అది కూడా రూ.300 నుంచి రూ.2వేల వరకు ఉండేది. కానీ ఇప్పుడా జరిమానాను భారీగా పెంచడంతోపాటు.. ఏకంగా ఉరిశిక్ష కూడా విధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ఆమోదించింది.