పవన్ కల్యాణ్ కి యువత పెద్ద బలం, ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో ప్రసంగించినా ఆయన చుట్టూ చేరేది యువతే. సీఎం సీఎం అంటూ పవన్ పేరుని జపం చేసేది వారే. అలాంటి యువత ఎన్నికల ప్రచారంలో కనపడతారు కానీ, బ్యాలెట్ బాక్స్ ల వరకు వెళ్లడంలేదనేది ప్రధాన కంప్లయింట్. మరి వారికి సరైన మార్గనిర్దేశనం చేయాలంటే, యువత సమస్యలపై పవన్ దృష్టిపెట్టాలి. కానీ అదే ఇప్పుడు జరగడంలేదని తెలుస్తోంది.