జాబ్ క్యాలెండర్ అంశాన్ని అటు లోకేష్, ఇటు పవన్ ఇద్దరూ ఒకేసారి హైలెట్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఇద్దరూ చప్పబడ్డారు. లోకేష్ బయటకు రాకుండా టీఎన్ఎస్ఎఫ్ నేతల్ని ముందుంచారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ విడుదల చేసి, జనసైనికుల్ని రోడ్లపైకి వదిలారు. అయితే అది కూడా ఉపాధి కల్పనా కేంద్రాలకు వెళ్లి వినతిపత్రం ఇవ్వడం వరకే వారి పని. దాన్ని కూడా పోలీసులు అడ్డుకునే సరికి, ప్రభుత్వ దౌర్జన్యం అంటూ కొంత హడావిడి జరిగింది. అయితే ఆ హడావిడి ఆ రోజుకే పరిమితం అయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి కానీ నోరెత్తలేదు.