పగలంతా ఉద్యోగులు పనిచేసి అలసిపోతే గృహిణులు ఇంట్లో పని చేసి అలసి పోతారు. అదేవిధంగా విద్యార్థులు కాలేజీకి వెళ్లడం చదవడం ఇలా అలసిపోతారు. కాబట్టి రాత్రి హాయిగా నిద్రపోతే కానీ మళ్ళీ ఉదయం తమ తమ పనులు చేసుకోలేరు. కానీ హైదరాబాద్ వాసులకు మెట్రో వల్ల నిద్ర పట్టకుండా పోయింది. మెట్రో లైన్ కు సమీపంలో ఉన్న ప్రజలందరూ రాత్రి వచ్చే భారీ శబ్దాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు రాత్రులు హాయిగా పడుకోకుండా మెట్రో శబ్దాలు హర్రర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఇలా పడుకుంటే అలా మెట్రో వచ్చేస్తుంది. మెట్రో వచ్చినప్పుడు వచ్చే శబ్దాలతో చిన్నపిల్లలు భయపడిపోతున్నారు.