ఏపీలో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు...ఈమె ఏ రేంజ్లో ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇస్తారో అందరికీ తెలిసిందే. రోజా రాజకీయంగా ఎలాంటి అంశంలోనైనా ప్రతిపక్షాలకు చెక్ పెట్టగలరు. అలాగే తమ పార్టీపై గానీ, తమ అధినేత జగన్పై గానీ విమర్శలు చేస్తే, వెంటనే వాటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేస్తారు. ఇలా ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా ఎమ్మెల్యేగా కూడా బాగానే పనిచేస్తున్నారు.