ఎక్కడైనా ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలకు తాము పోటీ చేసే సీట్లపై ఫుల్ క్లారిటీ ఉంటుంది. కానీ ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాత్రం తాను పోటీ చేసే సీటుపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. మామూలుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం ఉండగా, వైసీపీ అధినేత జగన్‌కు పులివెందుల నియోజకవర్గం ఉంది. ఆ ఇద్దరికి వారి నియోజకవర్గాల్లో తిరుగులేదు. వారు నియోజకవర్గాలకు వెళ్లకపోయినా ఎన్నికల్లో గెలిచే పరిస్తితి ఉంటుంది.