వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కుట్రకోణం వివరాలు బహిర్గతం చేయడం లేదంటున్న సీబీఐ పోలీసులు.. సీబీఐకు సునీల్ యాదవ్ సరిగ్గా సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సునీల్ యాదవ్ సహకరించడం లేదని.. ఇంకా ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. హత్యకు వాడిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. సునీల్ యాదవ్ ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు.