శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ అంటూ ఏపీలో స్కూళ్లను వర్గీకరించారు. ఇప్పటికే అంగన్వాడీలను తీసుకెళ్లి ఎలిమెంటరీ స్కూళ్లలో కలుపుతున్నారంటూ అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తాము ఉపాధి కోల్పోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీవ్యవహారంలోకి ప్రభుత్వ టీచర్లు కూడా రాబోతున్నారు.