కేరళ సర్కారు మరో సంచల నిర్ణయం తీసుకుంది. ఓవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న ఈ సందర్భంలో ఓనమ్ పండగకోసం ఆంక్షలు సడలించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని షాపులు తెరచి ఉంచేలా కొత్తగా ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు ఈరోజునుంచి అమలులోకి వస్తున్నాయి. ఓనమ్ పండగ ఈనెల 12నుంచి 23వరకు సంప్రదాయ బద్ధంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో షాపింగ్ అవసరాలు, ఇతర కార్యక్రమాలకోసం వారం రోజుల ముందుగానే కొవిడ్ ఆంక్షలు సడలించింది కేరళ సర్కారు.