ఏపీలో అధికార వైసీపీ తిరుగులేని బలంతో ఉండగా, ప్రతిపక్ష టీడీపీ బాగా వీక్‌గా ఉందనే సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి రెండేళ్ళు దాటిన కూడా ఏపీలో వైసీపీ బలం తగ్గలేదు...అలా అని టీడీపీ బలం పెరగలేదు. అంటే రాజకీయంగా ఇప్పటికీ అదే పరిస్తితి కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో ఏపీలో పుంజుకోవాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడంతో ఏపీలో బీజేపీ నేతలు ఓ రేంజ్లో హడావిడి చేస్తూ ముందుకెళుతున్నారు.