సాధినేని యామిని...మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో బాగా హైలైట్ అయిన పేరు. ఎన్ఆర్ఐగా రాజకీయాల్లోకి వచ్చిన యామిని కొంతకాలం టీడీపీలో కీలకపాత్ర పోషించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం యామిని బాగా హడావిడి చేశారు కూడా. ప్రతిరోజూ యామిని మీడియాలో కనిపించడం...ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం చేసేవారు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఈమె...వైసీపీ, జనసేనలపై గట్టిగానే ఫైర్ అయ్యేవారు.