తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ అంశం ఉందంటే అది హుజూరాబాద్ ఉపఎన్నికే. ఈ ఉపఎన్నికని అధికార టీఆర్ఎస్, బీజీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళుతున్నాయి. ఈ ఎన్నికలో సత్తా చాటాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగానే పయత్నిస్తున్నారు. ఇంతకాలం టీఆర్ఎస్ జెండాతో గెలిచిన ఈటల, ఇప్పుడు బీజేపీ జెండాతో గెలవాలని చూస్తున్నారు. అయితే హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్ద బలం లేకపోవడంతో, ఈటల తన సొంత బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు.