నిరుద్యోగంపై మొదట ప్రశ్నించింది తామేనని షర్మిల వ్యాఖ్యానించారు. రాజన్న సంక్షేమ పాలనను రాష్ట్రంలో మళ్ళీ తీసుకొచ్చే జెండా మన వైస్సార్ టిపి జెండా అంటూ చెప్పారు. సంక్షేమ పథకాలంటే వైస్సార్ గుర్తుకు వస్తారని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనా మళ్ళీ తిరిగిరాబోతుందని ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరారు. పల్లెపల్లెలో పాలపిట్ట రంగు జెండా ఎగరాలని షర్మిల అన్నారు. పాలపిట్ట రంగు జెండా చూస్తే వైఎస్ ఆర్ మనకు గుర్తుకురావాలంటూ వ్యాఖ్యానించారు.సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం ఇవే తమ పార్టీ ఎజెండా అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. సంక్షేమానికి చెరగని చిరునామా వైఎస్ ఆర్ అని అన్నారు. నీలం రంగు సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేద్కర్ వాదమే తమ నినాదం అంటూ చెప్పారు. పాలపిట్ట రంగు విజయానికి చిరునామా అని తెలిపారు. దసరా రోజు పాలపిట్ట ను చూస్తే ఎంత సంతోషిస్తారో.. మన జెండాను చుసిన అంతకంటే ఎక్కువ సంతోషం కలగాలని అన్నారు.