వచ్చే ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు...తమ వారసులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే కొందరు సీనియర్ నేతలు...తమ వారసులని ఎన్నికల్లో పోటీ చేయించారు. అయితే అందులో కొందరు వారసులు సక్సెస్ అయితే, మరికొందరు ఫెయిల్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మరికొందరు సీనియర్ నేతల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారని తెలుస్తోంది.