ఏపీలో తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు ఎలాంటి కొదవ లేదనే చెప్పొచ్చు. ఆ పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించే నాయకులు చాలామందే ఉన్నారు. తమ పార్టీని డిఫెండ్ చేసుకుంటూనే, ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడే నేతలు టీడీపీలో ఎక్కువగానే ఉన్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత అలాంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ఏమైపోయారో ఎవరికి తెలియడం లేదు. ఎంతసేపు టీడీపీ తరుపున మాట్లాడేందుకు ఒక నాయకుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఆయనే ప్రతిరోజూ మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లలో గానీ కనిపిస్తున్నారు.