రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి సీఎం జగన్...మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులని పెట్టనున్నామని జగన్ చెప్పి దాదాపు రెండేళ్ళు కావొస్తుంది. అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి, విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు.