ప్రజలపై పన్నుల భారం వేయకుండా సింపుల్గా బయటపడొచ్చంటున్నారు. అదేంటో తెలుసా.. సింపుల్గా కొత్త నోట్లను ముద్రించడమేనట. అవును.. ఇదే సరైన మార్గమని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం కరోనా సమయంలోనూ కొన్ని వస్తువులపై పన్నులు పెంచింది. ప్రత్యేకించి పెట్రో ధరలను క్రమంగా పెంచుతోంది. ఈ విషయం ఆయన వద్ద ప్రస్తావిస్తే.. కేంద్రం పదేపదే సెస్సులు పెంచడం సరికాదన్నారు. ఇందుకు కొత్త నోట్లు ముద్రించడమే సరైన పరిష్కారం అంటున్నారు అభిజిత్ బెనర్జీ.