ఎక్కడైనా అధికార పార్టీలో రాజకీయంగా బలపడటానికి మంత్రులకు మంచి ఛాన్స్ ఉంటుంది. తమ పదవితో ఇంకా బలపడి ప్రత్యర్ధులకు అందనంత ఎత్తుకు ఎదగవచ్చు. అలాగే పదవి ద్వారా తమ నియోజకవర్గాలకు మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఇంకా ఫాలోయింగ్ పెంచుకోవచ్చు. కానీ కొందరు మంత్రులు అలాంటి కార్యక్రమాల కంటే సొంత కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని పక్కనబెడతారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది చిత్తుగా ఓడిపోయారు. ఏదో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వారు మాత్రమే గెలవగలిగారు.