ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఇన్నాళ్లూ ఉద్యోగ నియామకాలకు అడ్డుగా ఉన్న ఉద్యోగుల వర్గీకరణ పూర్తయింది. క్రమంగా నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలగుతున్నాయి. కొత్త జోనల్ విధానం ప్రకారం.. జిల్లా, జోనల్, బహుళ జోన్ పోస్టుల గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది.