ఒలింపిక్ గేమ్స్ లో మనోళ్లు అదరగొట్టారని సంబరపడుతున్నాం. ఒక్కొకరికి కోట్ల రూపాయల నజరానాలు, ఎకరాల చొప్పున భూములు, స్పోర్ట్స్ అకాడమీలకోసం ఆర్థిక సాయం.. ఇలా అన్నీ ఇచ్చేస్తున్నారు. సంతోషించదగ్గ విషయమే. ఒలింపిక్ పతక విజేతకు స్వాగతం పలికేందుకు ఏకంగా మంత్రి వర్యులు ఎయిర్ పోర్ట్ కే వెళ్లారు. ఇంకా సంతోషం. కానీ దానికి రెండు రోజుల ముందే రెండు ప్రాణాలు హైదరాబాద్ మ్యాన్ హోల్స్ లో కలిసిపోయాయి. డెడ్ బాడీని వెదికేందుకు సైతం దిక్కులేని పరిస్థితి. మరి దీన్నెవరు పట్టించుకుంటారు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు వెళ్లేందుకు తీరిక దొరకబుచ్చుకున్న మంత్రులు.. బాధిత కుటుంబాల దగ్గరకు కనీసం వెళ్లారా..? వారిని పట్టించుకున్నారా..? దీనిపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి.