రెండేళ్లలో అధికార వైసీపీ ఎంపీల పనితీరు పట్ల ఏపీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? అంటే ఖచ్చితంగా లేరనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉండటానికి వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు గానీ, కానీ వారి వల్ల రాష్ట్రానికి పెద్దగా వచ్చిన లాభం లేదని అంటున్నారు. ఇక ఇందులో చాలామంది జగన్ ఇమేజ్‌తో గెలిచారు గానీ, గెలిచాక జగన్ ఇమేజ్ నిలబెట్టేలా కొందరు ఎంపీలు పనిచేయడం లేదని చెబుతున్నారు.