వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద అనర్హత వేటు పడుతుందా అన్నది చర్చగానే ఉంది. ఎందుకంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలై అపుడే సగం రోజులు గడచిపోయాయి. ఇక మిగిలిన రోజులు కూడా నిదానంగా జరిగిపోతాయి. అప్పుడు రాజు విషయంలో వైసీపీ పోరాటానికి అర్ధమే లేదు అన్న మాట ఉంది. వర్షాకాల సమావేశాల్లో అమీ తుమీ తేల్చేస్తామని హడావుడి చేసిన వైసీపీ మొదట్లో అలాగే చేసింది. కానీ ఇపుడు ఒక్కసారిగా సైలెంట్ అయింది. దానికి కారణమేంటి అన్నదే వైసీపీలోనూ గుసగుసలుగా ఉంది.