తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి వ్యూహాలు మరింత పదును అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉండటంతోనే తన అనుకున్నట్లు పనులు ఏమి జరగలేదు. పైగా కాంగ్రెస్లో సీనియర్ నేతల రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే అప్పుడు రేవంత్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ పీసీసీ అయ్యాక తన సొంత వ్యూహాలతో అటు అధికార టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూనే, ఇటు తమ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు.