ప్రస్తుతం కరోనా తీవ్రత సూచించే ఆర్ ఫ్యాక్టర్ అనేక రాష్ట్రాల్లో ఒక పాయింటు మార్కును దాటేసింది. ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఆర్ ఫ్యాక్టర్ 1.4 శాతం వరకు నమోదు అయ్యింది. అందుకే కరోనా విలయం మొదటి దశను మించిపోయింది. అయితే ఈసారి మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆర్ ఫ్యాక్టర్ 1ని దాటడమంటే కొవిడ్ ఆందోళనకరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఇది వరకే హెచ్చరించింది కూడా.