తిరుమలలో శ్రీవారి సర్వదర్శనాలు ప్రారంభమయ్యేందుకు మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశముందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే టీటీడీ తాజాగా చేసిన ప్రకటనతో సామాన్య భక్తులకు సుదీర్ఘ కాలం శ్రీవారి దర్శనభాగ్యం లభించదని తేలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను డీనోటిఫై చేసే వరకు దర్శనాల విషయంలో ఆంక్షలు ఉంటాయని టీటీడీ ఈవో తాజాగా ప్రకటించారు.