2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ స్కోరు సున్నా. రెండు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించిన అనంతపురం జిల్లా పార్టీ పరువుని కాస్త నిలబెట్టింది. ఆ జిల్లాలో మొదటినుంచీ టీడీపీకి పట్టుంది. కానీ ఫ్యాన్ గాలికి అక్కడ కూడా టీడీపీ విలవిల్లాడింది. జగన్ హవాకి తోడు, టీడీపీలో అంతర్గత పోరు వల్ల కూడా అక్కడ పార్టీకి బాగా నష్టం జరిగిందని అంటారు. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుంది. కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది.