సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సునిశిత విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లు ఎవరి డబ్బులు అంటూ ప్రశ్నించారు. ప్రజలు కష్టార్జితం ద్వారా పన్నులు కడితే వచ్చిన డబ్బును కేసీఆర్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా కేసీఆర్కు దళితులపై ప్రేమ ఉంటే.. ఆయన సంపాదించిన సొమ్మును పేదలకు పంచి పెట్టాలని సూచించారు.