కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనలో ఆసక్తిర అంశాలు చోటు చేసుకున్నాయి. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఉచితంగా బియ్యం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ సరకులకు ఇవి అదనం. అయితే వీటి క్రెడిట్ అంతా ఎక్కడికక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తోందని బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అందుకే రేషన్ దుకాణాల వద్ద మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఇవి మోదీ బియ్యం అని ప్రచారం చేస్తున్నారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ కూడా ఇదే విషయంపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.