భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో త్వరలో అతి పెద్ద మార్పు రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు రకాల వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం అత్యవసర పంపిణీ అనుమతి ఇచ్చినా.. కొవిషీల్డ్, కొవాక్సిన్ మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ రెండు కంపెనీల టీకాలనే ఉచితంగా పంపిణీ చేస్తోంది. స్పుత్నిక్ -వి టీకా ప్రైవేటు రంగంలో పంపిణీ అవుతోంది. కొత్తగా అనుమతి తెచ్చుకున్న రెండు టీకాలు ఇంకా మార్కెట్ లో కి రావాల్సి ఉంది. ఈ క్రమంలో టీకా మిక్సింగ్ పేరుతో జరిగిన పరిశోధనలు భారత్ లో ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి.