మన దేశంలో కరోనా నిరోధానికి ఇస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు అనేక అధ్యయనాలు తేల్చాయి. అయితే.. రెండు టీకాలు కలిపి ఇస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది. మొదటి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ ఇస్తే ఇమ్యూనిటీ బాగా అభివృద్ధి చెందుతున్నట్లు ఐసీఎంఆర్ పరిశోధనలో తేలింది.