మన భారత సైన్యం కేవలం సరిహద్దుల్లో కాపలాకాయడమే కాదు.. ఆటల్లోనూ దేశం పరువు కాపాడుతోంది. అవును.. ఇప్పుడు భారత్ కు టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలు వచ్చాయంటే.. అందులో సైన్యం పాత్ర కూడా ఉంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేక క్రీడల్లో సత్తా చాటిన వారిలో సైనికులు ఎందరో ఉన్నారు.