అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి చేసుకున్న వైసీపీపై కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకిత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకిత ఎక్కువ అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు మైనస్‌లో ఉన్నారని తెలుస్తోంది.