ఏదైనా అసెంబ్లీ స్థానం కావొచ్చు, పార్లమెంట్ స్థానం కావొచ్చు...ఎక్కడైనా సరే ఒక పార్టీకి ప్లస్ ఉంటే, మరో పార్టీకి మైనస్ ఉంటుంది. కానీ గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ స్థానంలో మాత్రం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలకు నెగిటివ్ ఎక్కువగా ఉంది. అలా అని ఇక్కడ జనసేన లేదా బీజేపీలకు ఏమన్నా సీన్ ఉందంటే..అది లేదు. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్‌పై వ్యతిరేకిత పెరిగినట్లు ఇటీవల పలు సర్వేలు చెబుతున్నాయి.