ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి...ఊహించని విధంగా వైసీపీ-బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు వైసీపీని కాపాడేది బీజేపీనే అని విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల మాత్రం బీజేపీ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఏపీ చేస్తున్న అప్పులపై కేంద్రం సీరియస్ అయిందనే విషయం బాగా హాట్ టాపిక్ అయింది. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తుందని వార్నింగ్లు ఇస్తుంది.