తెలుగుదేశం-జనసేనలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయా? అంటే పొత్తు పెట్టుకోకపోతే జగన్‌కు చెక్ పెట్టడం కష్టమని కొందరు రాజకీయ పెద్దలు చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి, మళ్ళీ జగన్‌కే బెనిఫిట్ అవుతుందని, గత ఎన్నికల్లో అదే జరిగిందని, ఈ సారి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు, పవన్‌లే నష్టపోతారని మాట్లాడుతున్నారు.