పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. అయితే ఈ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. కేసీఆర్ ప్రభుత్వం దళిత బందు పేరుతో దళితులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అందుకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.