ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆయన ఏం సాధించారు.. ఇదేగా మీ ప్రశ్న.. ఇప్పటి వరకూ మన దేశ ప్రధాని ఎవరూ సాధించని పని ఆయన సాధించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఓ సదస్సుకు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో జరిగిన సదస్సుకు ఇలా ఓ భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి.