కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలులో ఉంది. చాలా చోట్ల పగటిపూట కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. ఓవైపు ఈనెల 16నుంచి స్కూల్స్ తిరిగి మొదలు పెట్టాలని చూస్తున్నా ఆంక్షల సడలింపులో మాత్రం సర్కారు ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అందుకే సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోకపోయినా ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. సెకండ్ షో లకు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా వివాహాలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 150కి పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.